Saturday, March 9, 2019

ఎన్నికలలో నిష్పక్షపాతం గా ఉండగలరా …?

కర్నూలు న్యూస్‌టుడే: రాబోయే ఎన్నికల్లో జిల్లా పోలీసు యంత్రాంగం నిష్పక్షపాతంగా విధులు నిర్వహించి జిల్లా పోలీసుశాఖకు మంచి పేరు తీసుకురావాలని జిల్లా ఎస్పీ డాక్టర్ ఫక్కీరప్ప కాగినెల్లి అన్నారు. ఈ సందర్భంగా శుక్రవారం స్థానిక కర్నూలు జిల్లా పోలీసు కార్యాలయంలోని వ్యాస్ ఆడిటోరియంలో రాబోయే ఎన్నికల దృష్ట్యా శాంతి భద్రతల పరంగా జిల్లా పోలీసు యంత్రాంగం తో జిల్లా ఎస్పీ సమీక్ష సమావేశం నిర్వహించారు. జిల్లా ఎస్పీ డాక్టర్ ఫక్కీరప్ప కాగినెల్లి మాట్లాడుతూ…. సమస్యాత్మక గ్రామాల గురించి సరైన సమాచారం ఏప్పటికప్పుడూ పై అధికారులకు అందించాలన్నారు. ఆ గ్రామాలలో తగినన్ని పాలమిలటరీ బలగాలను మోహరింప చేస్తామన్నారు. ఫ్లయింగ్ స్క్వాడ్స్, స్ట్రైకింగ్ ఫోర్సు, రూట్ మొబైల్ వాహానాలు ఏర్పాటు చేసి అన్ని శాఖల అధికారులతో కలిసి ఎన్నికల విధులు నిర్వహించాలన్నారు. 77 ఫ్యాక్షన్ గ్రామాల్లో పికెట్ లు ఏర్పాటు చేయాలన్నారు. జిల్లా మొత్తం 54 మండలాలలో 54 ఫ్లయింగ్ స్క్వాడ్స్ ను ఏర్పాటు చేస్తున్నామన్నారు. ప్రతి అసెంబ్లీ నియోజక వర్గానికి కూడా ప్రత్యేకంగా 3 ఫ్లయింగ్ స్క్వాడ్స్ ను ఏర్పాటు చేస్తున్నామన్నారు. ఎన్నికల్లో నేరాలు జరిగినప్పుడు ఏఏ సెక్షన్ల క్రింద కేసులు నమోదు చేయాలో వివరించారు. బాధ్యులు కాని వారిపై అక్రమ కేసులు బనాయించరాదన్నారు. గన్ లైసెన్సులు ఉన్న వారు ఎన్నికల కోడ్ రాక ముందే తుపాకులు డిపాజిట్ చేయాలన్నారు. ఫారమ్ – 7 ఓట్ల తొలగింపు పై 30 ఫిర్యాదులు వచ్చాయన్నారు.

No comments:

Post a Comment