రానున్న ఎన్నికల్లో పార్టీ నుంచి టికెట్లు ఆశించేవారికి వయోపరిమితి విధించాలనే దిశగా బీజేపీ ఆలోచన చేస్తోందని ఓ జాతీయ పత్రిక రాసిన కథనం హాట్ టాపిక్ గా మారింది. 75 ఏళ్లు దాటిన నేతలను ఎన్నికల బరిలోకి దించాలా వద్దా అనే దిశగా ఆ పార్టీ హైకమాండ్ కసరత్తు చేస్తున్నట్లు రాసింది. ఎన్నికల్లో తలపడనున్న అభ్యర్థులకు సంబంధించి మూడు అంశాలను పరిగణనలోకి తీసుకుంటారట. అంతేకాదు వచ్చే వారం నుంచే అభ్యర్థులను కూడా ప్రకటించనున్నారట.
2014 ఎన్నికల్లో విజయం సాధించి అధికారంలోకి వచ్చాక కేబినెట్ లోకి మంత్రులను తీసుకునే విషయంలో వయో పరిమితి విధించారు మోడీ. దానికనుగుణంగానే 75 ఏళ్ల వయసు దాటినివారిని మంత్రివర్గంలోకి తీసుకోలేదు. ఆ ఏజ్ ఎఫెక్ట్ తో మంత్రి పదవులు రాని సీనియర్లెందరో ఉండటం గమనార్హం.. ఒకవేళ ఏజ్ కటాఫ్ నిబంధనకు బీజేపీ మొగ్గు చూపితే.. లోక్‌సభ బరిలో మహామహులు కనిపించబోరు. ఎల్‌కే అద్వానీ (91), మురళీ మనోహర్ జోషి (85), బీసీ ఖండూరీ (84), శాంతా కుమార్ (84), కరియా ముండా (82), హుకుందేవ్ నారాయణ్ యాదవ్ (79), కల్‌రాజ్ మిశ్రా (77), సుమిత్రా మహాజన్ (76), భగత్ సింగ్ కోష్యారి (76), యడ్యూరప్ప (76) లాంటి అగ్రనేతలకు టికెట్లు దక్కకపోవచ్చు

No comments:
Post a Comment