Friday, March 8, 2019

సమ్‌థింగ్ స్పెషల్‌గా మెగాస్టార్….

మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం “సైరా” చిత్రంలో నటిస్తున్న విషయం తెలిసిందే. సురేందర్ రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని రాంచరణ్ స్వయంగా నిర్మిస్తున్నారు.స్వాతంత్ర్య సమరయోధుడు  ఉయ్యాలవాడ నరసింహరెడ్డి జీవిత కథ ఆధారంగా ఈ చిత్రం  రూపుదిద్దుకుంటోంది. ఈ సినిమా తర్వాత చిరంజీవి తన నెక్స్ట్ మూవీని స్టార్ డైరెక్టర్ కొరటాల శివతో చేయబోతున్నారు.ఈ సినిమా కోసం మంచి సందేశంతో కూడిన కథను సిద్ధం చేశారు దర్శకుడు కొరటాల.విభిన్నమైన కథంశంతో సమ్‌థింగ్ స్పెషల్‌గా ఈ చిత్రం తెరకెక్కనుంది.ఈ చిత్రం కోసం ఓ హీరోయిన్‌ను కూడా ఎంపిక చేశారట.కొరటాల శివ తన “శ్రీమంతుడు” చిత్రంలో హీరోయిన్‌గా నటించిన శృతిహాసన్‌ను ఈ చిత్రం కోసం తీసుకున్నారని తెలిసింది.అయితే శృతిని హీరోయిన్‌గా కాకుండా ఓ కీలకమైన పాత్ర కోసం ఎంపిక చేశారని సమాచారం.అయితే ఈ సినిమాకు సంబంధించి ఇప్పటివరకు ఎలాంటి అధికారిక ప్రకటన రాలెదు.త్వరలో ఈ చిత్రానికి సంబంధించిన మరిన్ని వివరాలు తెలియనున్నారు.

No comments:

Post a Comment