అమరావతి న్యూస్‌టుడే: ఎన్నికలకు అన్ని విధాలా సమాయత్తమయ్యామని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. పార్టీ నేతలతో నిర్వహించిన టెలీకాన్ఫరెన్స్ లో చంద్రబాబు మాట్లాడారు. మనం ఎంత సన్నద్దంగా ఉన్నా… అవతలి పార్టీ నేర చరిత్ర పార్టీ అని గుర్తించాలన్నారు. నేటి నుంచి నెల రోజుల పాటు ప్రతి ఒక్కరిలోనూ అప్రమత్తత అవసరమని పార్టీ నేతలకు సూచించారు. ఎన్నికల యుద్దానికి కౌంట్‌డౌన్ ప్రారంభమైందన్నారు. మీ భవిష్యత్ నా బాధ్యత నినాదం రాష్ట్రమంతా మార్మోగాలన్నారు. మిమ్మల్ని ఇప్పటికే చాలా మందిని జైలుకు పంపి చూపారు కూడా విమర్శించారు. దీన్ని బట్టే ప్రజలు ఎవరికి ఓటు వేయాలో నిర్ణయించుకుంటున్నారు.

No comments:
Post a Comment