ఒంగోలు న్యూస్‌టుడే:
1.టీన్యూస్10 ఆన్‌లైన్ ఎడిషన్ ….
2. రుణమాఫీ నిధులు జిల్లాకు రూ.663.99 కోట్ల విడుదల …
3.మూడు విడతల్లో రూ.1991.97 కోట్లు రైతులకు …
ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రకటించినట్లుగానే రుణమాఫీ నాలుగు, అయిదు విడతల బకాయిలు చెల్లించేందుకు ప్రభుత్వం ఉత్తర్వు జారీ చేసింది. ఈ నెలాఖరుకు నాలుగోవిడత, ఏప్రిల్ మొదటి వారంలో అయిదో విడత రుణమాఫీ నిధులు రైతుల ఖాతాల్లో జమ కానున్నాయి. ఇప్పటి వరకు మూడు విడతల్లో రైతు ఖాతాలకు డబ్బులు జమ చేశారు. మిగిలిన రెండు విడతలు పూర్తయితే ఎన్నికల్లో ఇచ్చిన హామీ వందశాతం నెరవేరినట్లవుతుందిరూ.50 వేలు లోపు రుణ బకాయిలున్న రైతులకు తొలిదశలోనే పూర్తిగా చెల్లించారు.మిగిలిపోయిన రెండు విడతల డబ్బు నేరుగా రైతుల ఖాతాల్లో జమ చేయనున్నారు.జిల్లాకు రూ.663.99 కోట్ల విడుదల కానుంది. ఈ మేరకు జిల్లా వ్యవసాయ శాఖకు సాధికార సంస్థ నుంచి సమాచారం అందింది. మొత్తం 371484 మంది రైతులు లబ్ధిపొందనున్నారు. ఇప్పటివరకు మూడు విడతల్లో రూ.1991.97 కోట్లు రైతులకు అందజేశారు. ఇప్పుడు ఇచ్చే మొత్తంతో కలిపి జిల్లా రైతులకు రుణమాఫీ కింద సుమారు రూ.2655 కోట్ల ఇచ్చినట్లవుతోంది.ఎన్నికల్లో ఇచ్చిన హామీ వందశాతం నెరవేరినట్లవుతుంది.

No comments:
Post a Comment