ఢిల్లీ న్యూస్‌టుడే:
*టీఆర్ ఎస్ ను ఎదుర్కొనే శక్తి కాంగ్రెస్‌కు లేదన్నారు.
డీకే అరుణ వంటి సీనియర్ నేతలు బీజేపీలో చేరడాన్ని స్వాగతిస్తున్నామని పార్టీలో చేరడం శుభపరిణామమని బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మన్ అన్నారు. ఈ రోజిక్కడ ఆయన మాట్లాడుతూ… బీజేపీలో చేరేందుకు చాలా మంది మొగ్గు చూపుతున్నారన్నారు. కాంగ్రెస్ కుటుంబం, అవినీతి రాజకీయాలపై ప్రజలు విసుగు చెందారన్నారు. టీఆర్ ఎస్ ను ఎదుర్కొనే శక్తి కాంగ్రెస్‌కు లేదన్నారు. డీకే అరుణ ఎక్కడి నుంచి పోటీ చేస్తారో ఇవాళ స్పష్టత వస్తుందన్నారు. లోక్‌సభ ఎన్నికల తర్వాత తెలంగాణ లో సత్తా చూపుతున్నామన్నారు.

No comments:
Post a Comment