ఎం.వి.పి.కాలనీ న్యూస్‌టుడే:
- జిల్లావ్యాప్తంగా పోషణ అభయాన్ సంబరాలు
ఈ నెల 22 వరకు పోషణ, ఆరోగ్యం, ఎదుగుదలపై అవగాహనమహిళా శిశు సంక్షేమశాఖ పథక సంచాలకురాలు వై.సునంద..మహిళల్లో రక్తహీనత సమస్యను నియంత్రించేందుకు, చిన్నారుల్లో పోషకాహారలోపాన్ని తగ్గించి శక్తిమంతమైన భావిభారతాన్ని నిర్మించేందుకు జిల్లావ్యాప్తంగా పోషణ అభయాన్ సంబరాలను నిర్వహిస్తున్నామని మహిళా శిశు సంక్షేమశాఖ పథక సంచాలకురాలు వై.సునంద వెల్లడించారు. జాతీయ న్యూట్రిషన్ మిషన్ ఏర్పాటై ఏడాది కావొస్తున్న సందర్భంగా ఈ కార్యక్రమాన్ని రూపొందించామన్నారు. గర్భిణీలు, బాలింతలకు అందిస్తున్న అన్న అమృతహస్తం, రక్తహీనతతో ఇబ్బంది పడే వారికిస్తున్న బాల సంజీవని లాంటి వాటిని వారు తీసుకునేలా చైతన్యపరుస్తామన్నారు. వైద్యారోగ్య, విద్యాశాఖ, మెప్మా, డీఆర్‌డీఏ శాఖల సహకారంతో ఈ నెల 22 వరకు ఈ సంబరాలు అన్ని అంగన్వాడీల పరిధిలో జరుగుతాయన్నారు. వేసవిలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు, పరిశుభ్ర వాతావరణం లాంటి అంశాలపై అవగాహన కల్పించనున్నట్లు తెలిపారు.

No comments:
Post a Comment