Tuesday, March 19, 2019

విస్తృత ఏర్పాట్లు……


తిరుమల, న్యూస్‌టుడే:ముఖ్యంశాలు……
యాత్రికుల కోసం 25 వేల తాగునీటి సీసాలు, 50 వేల మజ్జిగ పొట్లాలు పాపవినాశనం తీర్థం దగ్గర పంపిణీకి సిద్ధంగా ఉంచారు.. పల్గుణీ నక్షత్రంలో పున్నమి సందర్భంగా బుధవారం జరిగే తుంబురుతీర్థ ముక్కోటికి తితిదే విస్తృత ఏర్పాట్లు చేసింది. ఇందులో భాగంగా మంగళవారం ఉదయం 6 గంటల నుంచి భక్తులను తీర్థానికి అనుమతిస్తోంది. వివిధ రాష్ట్రాల నుంచి వేలాదిగా యాత్రికులు తరలివస్తున్నారు. యాత్రికుల కోసం 25 వేల తాగునీటి సీసాలు, 50 వేల మజ్జిగ పొట్లాలు పాపవినాశనం తీర్థం దగ్గర పంపిణీకి సిద్ధంగా ఉంచారు. అన్నప్రసాదం ట్రస్టు ద్వారా భక్తులకు అన్నపానీయాల వితరణ చేస్తోంది. సేవలకు 600 మంది శ్రీవారి సేవకులను నియమించింది. వైద్య సేవలు అందించడానికి ప్రత్యేక శిబిరాన్ని ఏర్పాటు చేసింది. అత్యవసర సేవలు అందించడానికి రెండు అంబులెన్స్‌లను అందుబాటులో ఉంచింది. తీర్థంలో ప్రమాదాలకు ఆస్కారం లేకుండా ఇంజినీరింగ్‌ విభాగం నిచ్చెనలు అమర్చింది. సోలార్‌లైట్లు, రోప్‌లు, జనరేటర్లు ఏర్పాటు చేసింది. ప్రకృతి సౌందర్యాల నడుమ నిర్వహించే తుంబురుతీర్థ ముక్కోటిని దర్శించి స్నానమాచరించడానికి ఏటా తమిళనాడు, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రాల నుంచి వేలాదిగా భక్తులు తరలివస్తారు.

No comments:

Post a Comment