Saturday, March 9, 2019

ఓట్ల కోసం దొంగతనం….

అమరావతి న్యూస్‌టుడే:
దొంగతనంగా మా డేటాను తీసుకొని తిరిగి మాపైనే కేసు పెట్టారు.రాజకియ పార్టీలకే రక్షణ లేకపోతే,సామాన్యుల పరిస్థితి ఏంటీ అని చంద్రబాబు అన్నారు.టీడీపీకి పని చేశాడనే కోపంతో ఆ సంస్థను నాశనం చేశారు.అశోక్ పరారయ్యాడని ప్రకటించారు.కేసీఆర్ సంపాదించిన సొమ్మును ఏపీలో పెడుతున్నారు.ఏపీలో సామంత రాజు కోసమే ఇలా చేస్తున్నారు.ఇప్పటికే వెయ్యి కోట్లు పంపినట్లు చెబుతున్నారు.వైసీపీ,కేసీఆర్,ఢిల్లీ నాయకుల కుట్రలు సాగనీయం,మా కష్టార్జీతం వెనక్కి ఇవ్వరు,విభజన హామీలు అమలు చెయ్యరు.రూ.5వేల కోట్ల కరెంట్ వాడుకొని తిరిగి మేమే ఇవ్వాలని అంటున్నారు.కుట్రలు చేస్తే నేను చేతులు ముడుచుకొని కూర్చోను.సిట్ వేసిన తరువాతే కుట్ర బయటకు వచ్చింది.ప్రతి ఒక్కరూ ఓటును మూడు పూటలా చెక్ చేసుకోవాలి.మీ ఆస్తులు మీ పేరుతో ఉన్నాయా లేవా చెక్ చేసుకొనే పరిస్థితి.దొంగ అనేవాడు ఎక్కడో ఒక చోట సాక్ష్యం వదిలి వెళ్తాడు.ఫిర్యాదుతో పాటు స్కెచ్ వేసుకున్న పేపర్లు కూడా ఇచ్చేశారు.సరైన సమయంలో అశోక్ బయటకు వచ్చి చెబుతారు అని ఏపీ సీఎం చంద్రబాబు అన్నారు.
                                      

No comments:

Post a Comment