Saturday, March 9, 2019

100 రోజులు పూర్తి చేసుకున్న 2.0 ….


బాలీవుడ్ న్యూస్‌టుడే: ద‌ర్శకుడు శంక‌ర్ తెర‌కెక్కించిన చిత్రం 2.0. ఈ మూవీ న‌వంబ‌ర్ 29న ప్ర‌పంచ వ్యాప్తంగా విడుద‌ల‌యింది. ఈ చిత్రంలో ర‌జ‌నీకాంత్‌, అక్ష‌య్ కుమార్ , అమీ జాక్స‌న్ ప్ర‌ధాన పాత్ర‌ల‌లో న‌టించారు. ఈ చిత్రాన్ని లైకా ప్రొడ‌క్ష‌న్ సంస్థ నిర్మించింది. ఈ చిత్రంలో అక్ష‌య్ కుమార్ ప‌క్షి రాజా పాత్ర‌లో క‌నిపించ‌గా, అమీ వెన్నెల అనే రోబోగా అల‌రించింది. ఇక రజనీకాంత్‌ డాక్టర్‌ వశీకరణ్‌, చిట్టి, 2.ఓ, మైక్రోబోట్స్‌ 3.ఓ వంటి పలు పాత్రల్లో కనిపించి అల‌రించారు . ఈ చిత్రం నేటితో వంద రోజులు పూర్తి చేసుకుంది. ఎపిక్ డ్రామాగా తెర‌కెక్కిన ఈ చిత్రానికి మిక్స్‌డ్ టాక్ ల‌భించింది. దాదాపు ప‌దివేల‌కి పైగా స్క్రీన్స్ లో విడుద‌లైన ఈ చిత్రం బాక్సాఫీస్ ద‌గ్గ‌ర మాత్రం వ‌సూళ్ల ప్ర‌భంజ‌నం సృష్టించింది. కేవ‌లం హిందీలోనే వంద కోట్ల‌కి పైగా వ‌సూళ్లు రాబ‌ట్టింది 2.0 చిత్రం.

No comments:

Post a Comment