Friday, March 8, 2019

ఆడపడుచుల ఆవేదన…..

అమరావతి న్యూస్‌టుడే:
  • టి న్యూస్ 10 ఆన్ లైన్ ఎడిషన్
  • మాట నిలబెట్టుకుని తీరుతా…
  • అన్నం పెట్టే రైతు దైవంతో సమానం
  • రైతు సంక్షేమమే జనసేన ధ్యేయం
  • ఆడపడుచుల ఆవేదన మేరకే ఈ నిర్ణయం
  • పదవుల్లో 33 శాతం వారికే ఇస్తా
  • కట్టుదిట్టమైన భద్రత కల్పిస్తా
  • వెూసపూరిత వాగ్దానాలు చేయను
  • మహిళా దినోత్సవంలో పవన్‌
జనసేన పార్టీ రైతు సంక్షేమానికి కట్టుబడి ఉందని పార్టీ అధ్యక్షుడు పవన్‌కల్యాణ్‌ స్పష్టం చేశారు. శుక్రవారం గుంటూరు జిల్లా మంగళ గిరి హాయ్‌లాండ్‌లో జనసేన వీర మహిళా విభాగం ఆధ్వర్యంలో నిర్వహించిన అంత ర్జాతీయ మహిళా దినోత్సవ కార్యక్రమంలో జనసేనాని పాల్గొని మాట్లాడారు. రానున్న ఎన్నికల్లో జనసేన పార్టీ అత్యధిక మెజార్టీతో గెలుస్తుందని, అధికారంలోకి రాగానే ప్రతి రైతు కుటుంబానికి ఎకరానికి రూ. 8వేల ఆర్ధిక సాయాన్ని అందిస్తామని , మాట నిల బెట్టుకుని తీరుతామని స్పష్టంచేశారు. మహిళా దినోత్సవం రోజున రైతు కుటుంబాలకు చెందిన ఆడపడుచుల ఆవేదన ను అర్ధం చేసుకునే ఈ నిర్ణయం తీసుకున్నట్లు పవన్‌కల్యాణ్‌ ప్రకటించారు. మార్చి 14న ఆవిర్భావ దినోత్సవం నాడు పార్టీ మేనిఫేస్టో ప్రకటించాలని భావించాను.. రైతుల కుటుం బాలను నడిపే మహిళలు నన్ను ఆలోచింప చేయడం వల్ల మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని ముందుగానే ఈ విషయాన్ని ప్రకటించానని పవన్‌కల్యాణ్‌పేర్కొన్నారు. 

No comments:

Post a Comment