Wednesday, March 13, 2019

మహానగరంలో మాయగాడు…………

ఆరిలోవ, న్యూస్‌టుడే:
  •  పేదలను నకీలీ పత్రాలతో నిజమైనవిగా నమ్మించి, వారికి మాయమాటలు చెప్పి, ఒక్కొక్కరి వద్ద నుంచి రూ. 70 వేల నుంచి రూ. 1.30 లక్షల వరకూ వసూలు చేశాడు.
  • సదరు వ్యక్తిపై ఫోర్జరీ, మోసం, పత్రాల తారుమారు, నకిలీ పత్రాల తయారీ వంటి సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు.
వందలాది మంది వద్ద రూ. కోట్లు వసూలు చేసిన మహానగరంలో మాయగాడిని పోలీసులు ఎట్టకేలకు అరెస్టు చేసి, రిమాండుకు తరలించారు. సదరు వ్యక్తిపై ఫోర్జరీ, మోసం, పత్రాల తారుమారు, నకిలీ పత్రాల తయారీ వంటి సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. ఈనెల 5న ‘మహానగరంలో మాయగాడు’ శీర్షికన ఇళ్ల కేటాయింపుల పేరిట రూ. కోట్లు దండేస్తున్న వైనంపై ప్రచురితమయ్యింది. పేదలను నకీలీ పత్రాలతో నిజమైనవిగా నమ్మించి, వారికి మాయమాటలు చెప్పి, ఒక్కొక్కరి వద్ద నుంచి రూ. 70 వేల నుంచి రూ. 1.30 లక్షల వరకూ వసూలు చేశాడు. ఇతడి బాధితులు వందల్లో ఉన్నారు. కొందరు బాధితులు జిల్లా కలెక్టరు వద్దకు, మరి కొంతమంది తూర్పు ఎమ్మెల్యే వెలగపూడి వద్దకు వెళ్లారు. నిందితుడిని పోలీసులు అదుపులోకి తీసుకుని అతడి వద్ద నుంచి రూ. 13 లక్షల నగదు, రబ్బరు స్టాంపులు, వివిధ పత్రాలను స్వాధీనం చేసుకున్నారు. బుధవారం సాయంత్రం ఆరిలోవ పోలీస్‌ స్టేషన్లో ఎ.సి.పి. వైవీ నాయుడు నిందితుడిని విలేకరుల ఎదుట ప్రవేశపెట్టారు. గతంలో ఇచ్చిన తహసీల్ధార్‌ ఫిర్యాదు మేరకు ఇతడిని అరెస్టు చేశామని, వందమంది బాధితుల వద్ద సాక్ష్యాలు సేకరించామన్నారు. రబ్బరు స్టాంపులు తయారు చేయడం, పత్రాలను కంప్యూటర్‌లో తయారు చేసిన వారిని విచారించామన్నారు. ఎస్‌.ఐ. పాపారావు పాల్గొన్నారు.                                                                                                    డెస్క్:వసుధ

No comments:

Post a Comment