శ్రీకాకుళం,న్యూస్‌టుడే:
*చివరి రెండు రోజులే…….
*ఆన్‌లైన్ చేయడం వేగవంతం……
*అధికారుల వద్ద అందుబాటులో ఫారం-6…..
*ఆన్‌లైన్ చేయడం వేగవంతం……
*అధికారుల వద్ద అందుబాటులో ఫారం-6…..
కేంద్రం ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు ఈ నెల 15వ తేదీ వరకు ఓటరుగా నమోదు చేసుకునేందుకు అవకాశం ఉంది. అంటే గురు, శుక్రవారం.. ఈ రెండు రోజులే అత్యంత కీలకం. ఓటరుగా నమోదు చేసుకుంటేనే ఏప్రిల్ 11వ తేదీన జరిగే పోలింగ్‌లో ఓటు వేసేందుకు అవకాశం దక్కుతుంది. ఇప్పటి వరకు నమోదు చేసుకోని వారు ప్రస్తుతం ఫారం-6లను అందజేస్తున్నారు. జిల్లా యంత్రాంగం కూడా అన్ని తహసీల్దార్ కార్యాలయాలు, బూత్ స్థాయి అధికారుల వద్ద కూడా ఫారం-6లను అందుబాటులో ఉంచి ఓటరు నమోదుకు అన్ని ఏర్పాట్లు చేసింది. తహసీల్దార్ కార్యాలయాల్లో ప్రత్యేకంగా ఓటరు హెల్ప్‌లైన్ ఏర్పాటు చేసి కార్యాలయానికి వచ్చిన వారికి సమగ్రంగా సమాచారం ఇవ్వడం, దరఖాస్తులను అప్పటికప్పుడే ఆన్‌లైన్ చేయడం వంటివి వేగవంతం చేస్తున్నారు.
No comments:
Post a Comment