గుంటూరు న్యూస్‌టుడే:
*పలు అంశాల్లో యాప్ లు రూపొందించుట.
*ఎవరు ఎక్కడ నుంచి అయిన ఫిర్యాదు చేయవచ్చు.
ఈ దఫా సార్వత్రిక ఎన్నికలు ఆధునిక టెక్నాలజీతో జరగనున్నాయి. ఓటరు సౌలభ్యం కోసం ఎన్నికల కమీషన్ చాలా రకాల యాప్ లను అందుబాటులోకి తీసుకొచ్చింది. ఓటు నమోదు, నమోదైన ఓటు ఉందో లేదో తెలుసుకోవడం, ఫిర్యాదు చేయడం, ఎన్నికల నియామావళిపై ప్రజల నిఘా, ఇలా పలు అంశాల్లో యాప్‌లను రూపొందించారు. కేవలం ఆండ్రాయిడ్ మొబైల్ ఫోన్, ఇంటర్‌నెట్ సదుపాయం ఉంటే ఎవరైనా ఇంటి దగ్గర నుంచి కాని, ఆఫీసు నుంచి కాని, ఎక్కడి నుంచైనా దరఖాస్తు, ఫిర్యాదు, సమాచారం ఇచ్చే అవకాశాన్ని ఎన్నికల కమీషన్ కల్పించింది. ‘నా ఓటు ‘, ఓటరు సర్వీసు , సమాధాన్, సి విజన్, సుగం, వీవీప్యాట్ వంటి యాప్‌లను ఎన్నికల కమీషన్ ఏర్పాటు చేసింది. ఈ యాప్‌లను సెల్‌ఫోన్ లో డౌన్‌లోడ్ చేసుకొని ఈ సదుపాయాలు పొందవచ్చు.

No comments:
Post a Comment