Friday, March 15, 2019

క్రికెటర్ శ్రీశాంత్ కు సుప్రీంకోర్టులో భారీ ఊరట…..


న్యూఢిల్లీ న్యూస్‌టుడే:
  • కేరళకు చెందిన ప్రముఖ క్రికెటర్ శ్రీశాంత్ కు సుప్రీంకోర్టులో భారీ ఊరట లభించింది.
  • బీసీసీఐ విధించిన జీవితకాల నిషేధాన్ని అత్యున్నత న్యాయస్థానం కొట్టివేసింది
 కేరళకు చెందిన ప్రముఖ క్రికెటర్ శ్రీశాంత్ కు సుప్రీంకోర్టులో భారీ ఊరట లభించింది. 2013 ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీల్) స్పాట్ ఫిక్సింగ్ కేసులో ఆయనపై బీసీసీఐ విధించిన జీవితకాల నిషేధాన్ని అత్యున్నత న్యాయస్థానం కొట్టివేసింది. గతంలో బీసీసీఐ తీసుకున్న నిర్ణయాన్ని క్రమశిక్షణ కమిటీ మూడు నెలల్లోగా పున:సమీక్షించాలని జస్టిస్ కేఎం జోసెఫ్, జస్టిస్ అశోక్ భూషణ్ ల ధర్మాసనం ఆదేశించింది. తనపై విధించిన జీవితకాల నిషేధంపై శ్రీశాంత్ వాదనలను కమిటీ వినాలని ఈ సందర్భంగా సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. మరోవైపు శ్రీశాంత్ పై ఢిల్లీ హైకోర్టులో పెండింగ్ లో ఉన్న క్రిమినల్ అభియోగాలపై విచారణ యథాతథంగా కొనసాగుతుందని పేర్కొంది. తనపై బీసీసీఐ విధించిన జీవితకాల నిషేధాన్ని కేరళ హైకోర్టు సమర్థించడంతో శ్రీశాంత్ సుప్రీంకోర్టును ఆశ్రయించారు.

No comments:

Post a Comment