శ్రీకాకుళం,న్యూస్‌టుడే:
1) వాహన తనిఖీల్లో రూ.40 లక్షలు బట్టబయలు……….
2) గార్డు లేకుండా మరోసారి పట్టుబడితే చర్యలు తీసుకుంటామన్న అధికారులు……….
2) గార్డు లేకుండా మరోసారి పట్టుబడితే చర్యలు తీసుకుంటామన్న అధికారులు……….
ఒడిశా బ్రహ్మపుర నుంచి ఇచ్చాపురం మీదుగా ఒడిశా జయంతిపురానికి రూ.40 లక్షలు నగదుతో కారులో ప్రయాణిస్తుండగా, గురువారం ఇచ్చాపురం పట్టణం ఎర్రన్నాయుడు విగ్రహ కూడలిలో ఏర్పాటుచేసిన వాహన తనిఖీల కేంద్రం అధికారులు గుర్తించారు. ఆకారు లో ఇద్దరు అధికారులు ఉన్నారు. వారు ఇండియన్ బ్యాంకు క్యాషియర్, అకౌంటెంట్లుగా ఉధ్యోగ గుర్తింపుపత్రాలు చూపారు. తరచూ ఒడిశా జయంతిపురంలోని తమ తీసుకువెళ్తంటామని ఆధారపత్రాలను చూపించారు.. దీనిపై బ్రహ్మపుర ఇండియన్ బ్యాంకు అధికారిని చరవాణిలో సంప్రదించిన తనిఖీ అధికారులు ఉపతహసీల్దారు కొర్ణాని మురళీకృష్ణ, ఏఎస్‌ఐ నాగార్జునరావు, ఫ్లైయింగ్ స్వ్కాడ్ అధికారి మట్ట గణపతి ఈ వివరాలను ఆర్వో ఎన్.సీతామహాలక్ష్మికి వివరించారు. బ్యాంకు నగదుకావడంతో విడిచిపెట్టారు. బ్యాంకు నగదును పంపించే సందర్భంలో ఎస్కార్ట్‌గా తుపాకీతో ఉన్న గార్డు ఉంటారు. కానీ ఇక్కడ ఇద్దరు అధికారులే పెద్దమొత్తంలో ఒక రాష్ట్రం నుంచి మరో రాష్ట్రం మీదుగా తీసుకువెళ్లడం చర్చనీయాంశమైంది. ఈ విషయాన్ని అధికారులకు ఇచ్ఛాపురం అధికారులు స్పష్టంచేస్తూ, గార్డు లేకుండా మరోసారి పట్టుబడితే చర్యలు తీసుకుంటామన్నారు.
No comments:
Post a Comment