Tuesday, March 19, 2019

ఒంగోలు పులి’రా .,…పులి

ఒంగోలు న్యూస్‌టుడే
 సోమవారం ముఖ్యమంత్రి చంద్రబాబు ఒంగోలులో నిర్వహించిన ముఖ్య కార్యకర్తల సమావేశ వేదికపై నుంచి ఎంపీ అభ్యర్థిగా మంత్రి శిద్దా రాఘవరావును పరిచయం చేశారు. ఆయనను ‘అభివర్ణిస్తూ అఖండ విజయం చేకూర్చాలని పిలుపునిచ్చారు. ఇదే విషయమై మంగళవారం సింగరాయకొండ సమావేశంలో కార్యకర్తలు ఆసక్తిగా చర్చించుకున్నారు. శిద్దాను తాము కూడా  అభివర్ణించి నినాదాలు చేశారు. ఈ స్పందనకు మురిసిపోయిన శిద్దా, ఎమ్మెల్యే స్వామి ఇదే విషయమై ముచ్చటించుకున్నారు. ఆ తర్వాత స్వామి తన ప్రసంగంలో… ‘ఒంగోలు ఎంపీ అభ్యర్థిగా పులి లాంటి శిద్దా రాఘవరావును నిలబెట్టాన’ని ముఖ్యమంత్రి అన్న మాటలను గుర్తుచేయడంతో కార్యకర్తలు చప్పట్లు, కేరింతలతో హోరెత్తించారు. 2014 ఎన్నికల్లో పార్టీ మారిన వ్యక్తికి ఎంపీగా ఓడిన తర్వాత కూడా ఎమ్మెల్సీ పదవి ఇచ్చి చంద్రబాబు గౌరవించారన్నారు. కానీ ఆయన స్వలాభం కోసం పార్టీని వీడి వెళ్లిపోయారని పరోక్షంగా మాగుంట శ్రీనివాసులు రెడ్డిని ఉద్దేశించి స్వామి వ్యాఖ్యానించారు. ఈ స్థితిలో పార్టీ శ్రేణులకు నేనున్నానంటూ పులిలా ఎన్నికల సమరానికి సిద్ధమైన శిద్దా రాఘవరావును ప్రతిపక్ష పార్టీ అసూయపడేలా అత్యధిక మెజార్టీతో గెలిపించాలని పిలుపునిచ్చారు.

No comments:

Post a Comment