కడప న్యూస్‌టుడే:ముఖ్యంశాలు…..
*ప్రొద్ దుటూరు తెదేపాలో మంటలు…..
ప్రొద్దుటూరు తెదేపాలో మంగళవారం అసమ్మతి సెగలు ఎగసిపడ్డాయి. తెదేపా టికెట్‌ను ఆశించిన మాజీ ఎమ్మెల్యే వరదరాజులరెడ్డికి పార్టీ అధిష్ఠానం మొండిచేయి చూపటంతో ఆయన వర్గీయుల్లో ఆగ్రహావేశాలు వెల్లువెత్తాయి. దీంతో తెదేపా జెండాలు, ఫ్లెక్సీలు ఆగ్రహానికి కాలిపోయాయి. సీఎం చంద్రబాబునాయుడు డౌన్, డౌన్ అంటూ వ్యతిరేకంగా నినదిస్తూ నిరసన వ్యక్తం చేశారు. మాజీ ఎమ్మెల్యే మల్లేల లింగారెడ్డికి ప్రొద్దుటూరు ఎమ్మెల్యే టికెట్‌ను సోమవారం అధిష్ఠానం ఖరారు చేసింది. వరదతో ఐదేళ్లపాటు ఇన్‌ఛార్జి హోదా పేరుతో పార్టీకి ఊడిగం చేయించుకుని ఎన్నికల్లో టికెట్ ఇస్తామని ఆశ పెట్టి మోసం చేశారంటూ కార్యకర్తలు ఆవేశంతో ఊగిపోయారు. కార్యాలయంలోని తెదేపా జెండాలు, కండువాలను గుట్టగా వేసి నిప్పు పెట్టారు. ఆ తరువాత ప్లెక్సీలు, బేనర్లు, కటౌట్లను చింపేసి ధ్వంసం చేశారు. పెట్రోలు పోసి వాటికి నిప్పు పెట్టారు. ‘ప్రొద్దుటూరులో తెదేపా ఎలా రాణిస్తుందో.. లింగారెడ్డి ఎలా గెలుస్తారో చూస్తాం, మా శక్తి సామర్థ్యాలు ఏమిటో చూపిస్తామ’ంటూ కార్యకర్తలు రెచ్చిపోయారు. ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు గెలవలేరంటూ నినదించారు. ఈ తతంగాన్ని మేడపై నుంచి వరదరాజులురెడ్డి వారించబోయారు. అయినా వారు వినలేదు. మరింత రెచ్చిపోయి మేడ గోడ పొడవునా ఉన్న వరదరాజులురెడ్డి ఫ్లెక్సీని కూడా చింపేశారు.

No comments:
Post a Comment