కర్నూలు న్యూస్‌టుడే::
ఈ సార్వత్రిక ఎన్నికల్లో కర్నూలు నుంచి నిలబెట్టిన తేదేపా అభ్యర్థులని అధినేత చంద్రబాబు కితాబిచ్చారు.మంగళవారం స్థానిక ఎస్టీబీసి మైదానంలో ఏర్పాటు చేసిన ఎన్నికల సవ్నాహక సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు.ఓర్వకల్లుకు విమానంలో వచ్చిన ఆయన ఆక్కడి నుంచి హెలికాఫ్టర్‌లో కర్నూలు చేరుకున్నారు. సభలో చంద్రబాబు మాట్లాడుతూ కర్నూలును అభివృద్ధి చేసి దేశానికే ఆదర్శంగా నిలుపుతానన్నారు. ఇప్పటికే ఉద్యాన పంటల్లో దేశంలో నాలుగో స్థానంలో ఉందని గుర్తుచేశారు. కరవు జిల్లాను రత్నాల సీమగా మార్చే బాధ్యత తనదన్నారు. ప్రపంచానికి విత్తనం సరఫరా చేసేలా మెగా సీడ్ పార్కు తీసుకొచ్చామన్నారు. సిమెంట్, స్టీలు, ఫుడ్ ప్రాసెసింగ్ పరిశ్రమలు ముందుకొచ్చాయన్నారు. గోదావరి, కృష్ణా జిల్లాల కంటే ఆదాయ వనరుల్లో సీమ జిల్లాలే ముందున్నాయని, ఇది గర్వకారణమన్నారు.
No comments:
Post a Comment