Tuesday, March 19, 2019

జగన్‌కి ఓట్లెందుకు వేయాలి…..

అనంతపురం న్యూస్‌టుడే:
కేసీఆర్‌తో జగన్ చెట్టాపట్టాల్ వేసుకుని తిరుగుతున్నారని ఆరోపించారు.
వైసీపీ అధినేత జగన్‌పై మంత్రి నక్కా ఆనందబాబు మండిపడ్డారు. అసెంబ్లీకి రాకుండా జగన్ బాధ్యతలను విస్మరించారని ధ్వజమెత్తారు. అసెంబ్లీకి రాని జగన్‌కు ఓట్లు ఎందుకు వేయాలని ప్రశ్నించారు. అధికార పక్షానికి, విపక్షానికి సమాన బాధ్యత ఉంటుందని గుర్తుచేశారు. పోలవరం పై కుట్రలు చేస్తున్న కేసీఆర్‌తో జగన్ చెట్టాపట్టాల్ వేసుకుని తిరుగుతున్నారని ఆరోపించారు. సాగర్ నుంచి నీళ్లు రాకుండా అడ్డుకున్న కేసీఆర్‌తో మిలాఖత్ దారుణమన్నారు. కేసీఆర్‌తో జతకట్టి ఏపీ ప్రజల భవిష్యత్ తాకట్టు పెడతావా? అంటూ జగన్‌పై మంత్రి ఆగ్రహం వ్యక్తం చేశారు.

No comments:

Post a Comment