Friday, March 15, 2019

దక్షిణ ఆర్వోగా శ్రీనివాస్….


విశాఖ న్యూస్‌టుడే:
విశాఖ దక్షిణ నియోజకవర్గ రిటర్నింగ్ అధికారి (ఆర్వో)గా విశాఖ జిల్లా భూ పరిరక్షణ విభాగ ఉప కలెక్టర్ ఎస్.శ్రీనివాసమూర్తి నియమితులయ్యారు. గత కొంత కాలం నుంచి భూ పరిరక్షణ విభాగ ఉప కలెక్టర్ పోస్టు ఖాళీగా ఉంది. ఎన్నికలు సమీపిస్తోన్న తరుణంలో కీలకమైన ఉప కలెక్టర్ పోస్టును భర్తీ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో శుక్రవారం శ్రీనివాసమూర్తి బాధ్యతలు చేపట్టారు. ఇంతవరకూ ఈ పోస్టులో ఇన్ఛార్జిగా కొనసాగిన సెట్విస్ సీఈవో గీతాంజలి నుంచి ఆయన బాధ్యతలు చేపట్టారు. వెనువెంటనే ఎన్నికల నిర్వహణ క్రతవులో భాగస్వాములయ్యారు. టర్నర్ చౌల్ట్రీ ఆవరణలోని మహారాణిపేట తహసిల్దార్ కార్యాలయం కేంద్రంగా ఆయన బాధ్యతలు నిర్వహిస్తున్నారు. శ్రీకాకుళంలో ఐటీ గ్రిడ్స్ సంస్థ సీఈవోగా పనిచేస్తూ బదిలీపై ఇక్కడకు వచ్చిన శ్రీనివాసమూర్తి గతంలో విజయనగరం ఆర్డీవోగా బాధ్యతలు నిర్వహించారు. తహసిల్దార్ కిరణ్కుమార్, ఉప తహసిల్దార్ ఎస్ఎం జిలానీ, రెవెన్యూ ఇన్స్పెక్టర్ చైతన్య తదితరులు కొత్త ఉప కలెక్టర్తో సమావేశమై ఎన్నికల నిర్వహణ ఏర్పాట్లపై చర్చించారు.

No comments:

Post a Comment