గుంటూరుజిల్లా:వేమూరు: న్యూస్‌టుడే: ముఖ్యాంశాలు…
* ప్రజలు బాగోగులు పట్టించుకోని జగన్..
* హక్కుల కోసం నిత్యం చంద్రబాబు కేంద్రంపై పోరాటం…
జగన్ కు అధికారం వస్తే పోలవరం ప్రాజేక్టు పూర్తి కాదని, ఎక్కడ అభివృద్ధి కార్యక్రమాలు అక్కడే ఆగిపోతాయి. రాష్ట్ర మంత్రి ఆనందబాబు వ్యాఖ్యానించారు. తెనాలిలోని చావాస్ గ్రాండ్ కల్యాణ మండపంలో శుక్రవారం వేమూరు నియోజవర్గ తెదేపా కార్యకర్తల విస్తృత సమావేశం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జగన్‌కు ఓటు వేస్తే కేసీఆర్‌కు, అక్కడి ఉంచి మోదీకి వెళుతుందన్నారు. ఇక్కడ ప్రజలు బాగోగులు పట్టించుకోని జగన్ ఆంధ్ర ప్రజలను మోసం చేయడానికి హైదరాబాద్‌లో ఉండి తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌తో కలసి కుట్రలు చేస్తున్నారని ఆరోపించారు. రాష్ట్రానికి రావాల్సిన నిధులు, హక్కుల కోసం నిత్యం చంద్రబాబు కేంద్రంపై పోరాటం చేస్తుంటే, జగన్ మాత్రం కేసుల మాఫీ కోసం మోదీ కాళ్లు పట్టుకున్నారని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం పోలవరం ప్రాజెక్టు పనుల 65 శాతం పూర్తయ్యాయని, వీటికి సంబంధించి కేంద్రం ఇంకా రూ. 5 వేల కోట్ల పైన నిధులు మంజూరు చేయాల్సి ఉందన్నారు. పోలవరం పూర్తయితే ఆంధ్రప్రదేశ్ సుభిక్షంగా మారుతుందన్నారు. ఇక్కడి అభివృద్ధిని చూసి ఓర్వలేని కేసీఆర్, జగన్‌ను అడ్దుపెట్టుకుని మనలను దెబ్బ తియ్యాలని చూస్తున్నారన్నారు.

No comments:
Post a Comment