మార్కాపురంలో.. ఒంగోలు… న్యూస్‌టుడే:
శాసన సమరం కీలక ఘట్టానికి చేరుకుంటోంది… నామినేషన్లకు గడువు సమీపిస్తోంది. అయినప్పటికీ అభ్యర్థుల ఎంపిక కొలిక్కి రాలేదు. వైకాపాలో పరిస్థితి మరింత గందరగోళంగా మారింది. చివరి దశలో అభ్యర్థుల మార్పులు ఆ పార్టీకి తలనొప్పులు తీసుకువచ్చేలా ఉన్నాయి. ఒంగోలు లోక్‌సభ స్థానం వ్యవహారమూ ఎటూ తేలలేదు. ఇవన్నీ శ్రేణులను అయోమయంలోకి నెట్టేస్తున్నాయి. ముఖ్యంగా ఒంగోలు లోక్‌సభ స్థానంలో ఎవరు పోటీ చేస్తారనే సందేహం వీడడం లేదు. మాగుంట పార్టీలోకి వచ్చి పోటీ చేస్తారా? చేస్తే ఆయనకు వైవీ పూర్తిగా సహకరిస్తారా? అనేది చిక్కు ప్రశ్నలుగా మారాయి. ఈ అంశాలపై చర్చించేందుకు వైకాపా ముఖ్య నాయకుడు బాలినేని శ్రీనివాసరెడ్డి బుధవారం ఆ పార్టీ అధినేత జగన్‌ను కలిశారు. మార్కాపురం, కొండపి, సంతనూతలపాడు అంశాలపై చర్చించారు.

No comments:
Post a Comment