కృష్ణ న్యూస్‌టుడే: మైలవరం – నిబంధనలకు వ్యతిరేకంగా నిర్వహిస్తున్న బెల్ట్ షాపులపై ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ శాఖాధికారులు దాడులు నిర్వహించి ఇరువురిని అరెస్ట్ చేశారు. ఎక్సైజ్ సిఐ.జి. శ్రీనివాస్ తెలిపిన వివరాల ప్రకారం గణపవరం,మోర్సీమిల్లి గ్రామాల్లో బెల్టుషాపులు నిర్వహిస్తున్న కొర్లపాటి రమణ,గరిటే తిరుపతిరావు అరెస్టు చేసి వారి వద్ద నుండి 25 మద్యం సేసాలను స్వాధీనం చేసుకున్నారు. బెల్టుషాపులు పై ప్రభుత్వం పూర్తి నిషేధం విధించిందని నిబంధనలకు వ్యతిరేకంగా బెల్టుషాపులు నిర్వహించినట్లైతే కఠిన చర్యలు తీసుకుంటామని సిఐ.హెచ్చరించారు.

No comments:
Post a Comment