Tuesday, March 12, 2019

పార్టీ నేతలకు భరోసా ఇచ్చిన చంద్రబాబు నాయుడు…..

గుంటూరుజిల్లా:
  • * కార్యకర్తల అభీష్టం మేరకే అభ్యర్ధుల ఎంపిక ..
  • * పార్టీ కోసం పని చేస్తా అని స్ఫూర్తిదాయకం…
వైసీపీలో వేలంపటలా టిక్కెట్లు అమ్ముకుంటున్నారని, కాని తెలుగు దేశం పార్టీలో అలాంటి పరిస్థితి లేదని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. మంగళవారం పలువురు టీడీపీ నేతలతో జరిగిన టెలీకాన్ఫరెన్స్‌లో చంద్రబాబు   మాట్లాడుతూ…ప్రజాభిప్రాయం. కార్యకర్తల అభీష్టం మేరకే అభ్యర్ధుల ఎంపిక జరుగుతోంది. ఎలాంటి రాగద్వేషాలు లేవు. ఎవరికైనా అనుమానాలుంటే రికార్డులు కూడా ఇస్తా అని చంద్రబాబు అన్నారు. పార్టీ నిర్ణయాన్ని ఎవరూ  వ్యతిరేకించడానికి లేదన్నారు. టిక్కెట్ ఇవ్వలేకపోతున్నామని, నేను చెప్తే  అర్ధం చేసుకుంటున్నారన్నారు. పార్టీ కోసం పని చేస్తామని కొందరు ష్పూర్తిదాయకంగా వ్యవహరిస్తున్నారని, కుటుంబ పెద్దగా అందరికీ న్యాయం చేసే బాధ్యత నాది అని చంద్రబాబు అన్నారు. అందరినీ గుర్తించి భవిష్యత్ లో పదవిలిస్తామన్నారు.

No comments:

Post a Comment