Wednesday, March 20, 2019

చికెన్‌ ముక్క.. మందు చుక్క…….!

చిత్తూరు:న్యూస్‌టుడే:ముఖ్యంశాలు….
*ఓటర్లకు వైకాపా రాజకీయ విందు భోజనం…….
చంద్రగిరి నియోజకవర్గంలో రాజకీయం నానాటికీ ఉద్రిక్తంగా మారుతోంది. వైకాపా నాయకులు రోజురోజుకూ ఎన్నికల ‘కోడ్‌’ను ఉల్లంఘిస్తున్నారు. మొన్నటికి మొన్న అర్ధరాత్రి తిరుపతి గ్రామీణ మండలం ముండ్లపూడిలో తాయిలాలు పంచుతూ పోలీసులకు చిక్కినట్లే చిక్కి తప్పించుకున్నారు. కొన్ని కానుకలు మాత్రం పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. నిన్నమొన్నటి వరకు మరో అడుగు ముందుకేసి పట్టపగలే ‘యాత్ర’ సినిమా ఉచితంగా చూపిస్తూ పల్లె ప్రజలకు భోజనాలు సైతం పెట్టించారు. తాజాగా ఎన్నికల కోడ్‌ను ఖాతరు చేయకుండా విందు రాజకీయాలకు తెరలేపారు. ఎన్నికల ప్రచార సమావేశాలు నిర్వహించుకోవడానికి అనుమతి తీసుకుని వాటిని విందు వినోదాలకు వేదికలుగా మార్చుకుంటున్నారు. బుధవారం దామలచెరువు మ్యాంగోనగర్‌లోని ఓ కల్యాణమండపంలో వైకాపా నాయకులు కోడికూర, చికెన్‌ బిరియానీతో పాటు ముక్కుపుడక కిట్‌ పంచుతున్నారంటూ ఉదయం ప్రచారం జరిగింది. నియోజకవర్గ ముఖ్యనాయకుడు పంపిణీకి వస్తున్నట్లు ప్రచారం జరిగింది. పెద్దఎత్తున మహిళలు, ప్రజలు అక్కడికి చేరుకున్నారు. వారికి అక్కడ విందుభోజనాలు వడ్డించారు.

No comments:

Post a Comment