గుంటూరుజిల్లా: న్యూస్‌టుడే:
*పెద్ద ఎత్తున ఉపాధ్యాయుల్లో అయోమయం…
*ఎన్నికల సంఘం స్ఫూర్తికి విఘాతం…
కృష్ణా-గుంటూరు జిల్లాల పట్టభద్రుల నియోజకవర్గానికి 22న జరిగే పోలింగ్‌కు సంబంధించి ఉద్యోగులకు ఎన్నికల కమిషన్ ప్రత్యేక సెలవు మంజూరు చేయగా, విద్యాశాఖలో మాత్రం గందరగోళం నెలకొంది. విద్యాశాఖాధికారులు నిముషానికో నిర్ణయం తీసుకోవటంతో బుధవారం జిల్లాలో పెద్ద ఎత్తున ఉపాధ్యాయుల్లో అయోమయం నెలకొంది. ఈ విద్యా సంవత్సరం ప్రారంభం నుండి ప్రత్యేక సెలవులు, స్థానిక సెలవుల విషయంలో స్పష్టమైన విధానం అమలు చేయకుండా చివరి వరకూ నాన్చడంపై ఉపాధ్యాయుల నుండి విమర్శలొస్తున్నాయి. 22 న పోలింగ్ విషయంలోనూ ఇదే విధానం అనుసరిస్తున్నారని ఇది ఎన్నికల సంఘం స్ఫూర్తికి విఘాతమనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. గుంటూరుజిల్లాతో పాటు, రాష్ట్రంలో పలు జిల్లాల విద్యాశాఖాధికారులు గురువారం హోలీ సందర్భంగా సెలవు ఇస్తున్నట్లు ముందు ప్రకటించారు. తర్వాత వెంటనే నిర్ణయం మార్చుకుని సెలవు రద్దు చేశారు.

No comments:
Post a Comment