Wednesday, March 13, 2019

ఐదేళ్లకోసారి రామడోలి సంబరం…..

విశాఖ న్యూస్‌టుడే:
  • ఉత్సవానికి హాజరైన ఎమ్మెల్యే ఈశ్వరి…
  • వేలాది మంది భక్తులతో కోలాహలం…
  • కొండపై 60 అడుగుల ఎత్తులో మామిడి చెట్లతో ఏర్పాటు చేసిన రామడోలి ఊయలపై రామ, లక్ష్మణ, భరత, శత్రుజ్ఞుల పేరిట పదేళ్ల వయసున్న చిన్నారులను ఎక్కించి ఊపారు…
తాజంగిలో దొంతులమ్మ రామడోలి (ఊయల) ఉత్సవం మంగళవారం అంగరంగ వైభవంగా జరిగింది. మునుపెన్నడూ లేని విధంగా ఈ ఏడాది ఊయల ఉత్సవానికి అశేషంగా భక్తులు తరలివచ్చారు. ఐదేళ్లకోసారి ఈ ఉత్సవాన్ని నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది. ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వరి రామడోలి జాతరకు హాజరయ్యారు. తొలుత దొంతులమ్మ వల విరాట్‌ విగ్రహానికి పూజలు చేశారు. కొండపై 60 అడుగుల ఎత్తులో మామిడి చెట్లతో ఏర్పాటు చేసిన రామడోలి ఊయలపై రామ, లక్ష్మణ, భరత, శత్రుజ్ఞుల పేరిట పదేళ్ల వయసున్న చిన్నారులను ఎక్కించి ఊపారు. హనుమాన్‌ వేషధారణలో ఉన్న వ్యక్తితోపాటు పూజారులు చిన్నారులకు రక్షణగా ఉన్నారు. ఊయల ఉత్సవంలో పాల్గొనే చిన్నారులను వారం రోజుల ముందు నుంచే ఉపవాసాలు ఉంచారు. జాతరకు ముందు రోజే వారిని కొండపై ఉన్న రాతి గుహకు తీసుకువెళ్లి అమ్మవారికి పూజలు చేయించారు. ఉత్సవం అనంతరం కొండపై అమ్మవారికి మొక్కులు చెల్లించి తిరుగుముఖం పట్టారు. తెదేపా నాయకులు చల్లంగి లక్ష్మణరావు, ఎంపీటీసీ సభ్యుడు అంగధరావు, మాజీ సర్పంచి రామస్వామి, ఉత్సవ కమిటీ సభ్యులు నారాయణరావు, శంకర్‌ తదితరులు పాల్గొన్నారు.

No comments:

Post a Comment