Wednesday, March 13, 2019

టీడీపీ లో భగ్గుమన్న…… అసంతృప్తి…

గుంటూరుజిల్లా: అమరావతి:
  • * సత్తెనపల్లి టికెట్ పై టీడీపీ లో రచ్చ.
  • *ఎమ్మెల్యే టికెట్ పై గందరగోళం…
లోక్‌సభ ఎన్నికల వేళ తెలుగుదేశం పార్టీలో అసంతృప్తి భగ్గుమంది. గుంటూరు జిల్లా సత్తెనపల్లి టికెట్ పై టీడీపీ లో రచ్చ మొదలైంది. ఏపీ శాసనసభ స్పీకర్ కోడెల శివప్రసాద్‌రావుకు సత్తెనపల్లి ఎమ్మెల్యే టికెట్ ఇవ్వొద్దని టీడీపీ కార్యకర్తలు ఆందోళనకు దిగారు. కోడెల శివప్రసాద్‌కు టికెట్ ఇస్తే సహకరించేది లేదని హైకమండ్‌ను అసమ్మతి నేతలుహచ్చరించారు. పోలవరం ఎమ్మెల్యే టికెట్ పై కూడా గందరగోళం నెలకొంది. చంద్రబాబు నివాసం ముందు టీడీపీ కార్యకర్తలు ఆందోళనకు దిగారు. సిట్టింగ్ ఎమ్మెల్యే ముడియం శ్రీనివాస్ కు టికెట్ ఇవ్వొద్దని కార్యకర్తలు డిమాండ్ చేస్తున్నారు. అరుపులు, వ్యతిరేక నినాదాలతో చంద్రబాబు నివాసం దద్దరిల్లింది.
                         

No comments:

Post a Comment