Wednesday, March 20, 2019

ప్రత్యేక రైల్వేజోన్ తెచ్చింది బీజేపీనే…….విష్ణు…..


గుంటూరుజిల్లా: న్యూస్‌టుడే: 
*  కుంభకోణాలు, దోపిడీలకు కేరాఫ్ అడ్రస్ గంటా శ్రీనివాసరావు…
*చంద్రబాబు మతితప్పి, గతి తప్పి వ్యవహరిస్తున్నారు… 
ప్రత్యేక రైల్వే జోన్ తెచ్చింది బీజేపీనేనని ఆ పార్టీ నేత విష్ణుకుమార్ రాజు అన్నారు. కొత్త జోన్‌లో వాల్తేర్ కూడా ఉంటుందని తెలిపారు. విశాఖ నార్త్‌లో అభివృద్ధి చేసిన చంద్రబాబుకు కృతజ్ఞతలు తెలిపారు. కుంభకోణాలు, దోపిడీలకు కేరాఫ్ అడ్రస్ గంటా శ్రీనివాసరావు అని విమర్శించారు. ఓటుకు 10 వేలు ఇచ్చేందుకు గంటా సిద్ధమయ్యారని ఆరోపించారు. డబ్బులు తీసుకుని ఓటు వేసేవాళ్లు భిక్షగాళ్లతో సమానమని అభివర్ణించారు. చంద్రబాబు మతితప్పి, గతి తప్పి వ్యవహరిస్తున్నారని బీజేపీ నేత సోము వీర్రాజు వ్యాఖ్యానించారు. మోదీని దెబ్బకొట్టాలన్న ఆలోచనతో చంద్రబాబు డౌన్ అవుతున్నారని చెప్పారు. వచ్చే ఎన్నికల్లో చంద్రబాబు ఘోరంగా ఓడిపోతారని జోస్యం చెప్పారు.

No comments:

Post a Comment