Wednesday, March 20, 2019

అభ్యర్థులు వారే..గుర్తులే మారాయ్‌…

ఒంగోలు ప్రకాశం న్యూస్‌టుడే;
ఎన్నికల ముందు, ప్రభుత్వం ఏర్పడిన తర్వాత కండువాలు మార్చుకోవడం నాయకులకు అలవాటే. అది పరిపాటి కూడా. ఈ ఎన్నికల్లో ఈ మార్పులే ఆసక్తికరంగా మారాయి. గత అయిదేళ్లలో చోటుచేసుకున్న రాజకీయ మార్పులు విదితమే. కొందరు ఎమ్మెల్యే పార్టీలు మారారు. ఇప్పుడు వారి పోటీ ఆసక్తికరంగా మారింది. గిద్దలూరులో 2014 నాటి ఎన్నికలు హోరాహోరీగా జరిగాయి. తెలుగుదేశం పార్టీ తరఫున అన్నా రాంబాబు పోటీ చేశారు. వైకాపా తరఫున అశోక్‌రెడ్డి పోటీలో ఉన్నారు. పోటీ వారిద్దరి మధ్యనే. నువ్వా నేలా అనేలా తలపడ్డారు. ఈ క్రమంలో అశోక్‌ తెదేపాలోకి వచ్చేశారు. ఇక మొదలయ్యింది అసలైన సెగ. ఇద్దరికీ పొసగలేదు. అశోక్‌ ఆధిపత్యాన్ని తట్టుకోలేని రాంబాబు, తన శ్రేణులను కాపాడుకునే క్రమంలో తెదేపాను వీడారు.  ఇద్దరూ విజయం కోసం ఇప్పుడు హోరాహోరీ తలపడుతున్నారు. ప్రచారం హోరెత్తిస్తూ, అంతర్గత చర్చలకు పదును పెడుతున్నారు. అందుకే గిద్దలూరులో అభ్యర్థుల గుర్తులు మారాయ్‌.

No comments:

Post a Comment