Wednesday, March 20, 2019

ఈ ఏడాది కర్ణాటక మార్కెట్‌లో మంచి ధరలు ..


ప్రకాశం చీమకుర్తి, న్యూస్‌టుడే: 
జిల్లాలో ఈ నెల 22 నుంచి పొగాకు కొనుగోళ్లు ప్రారంభం కానున్నాయి. తేలికపాటి నేలలున్న వేలం కేంద్రాల పరిధిలో 22 నుంచి ప్రారంభం కానుండగా,  తేలికపాటి నేలలు ఉన్న పొదిలి, కందుకూరు, కనిగిరి, నెల్లూరు జిల్లాల్లోని కలిగిరి, డీసీ పల్లి వేలం కేంద్రాల్లో ఈనెల 22 నుంచి కొనుగోళ్లు ప్రారంభం కానున్నాయి. నల్లనేలలు ఉండే ఒంగోలు 1, 2 వేలంకేంద్రాలతోపాటు టంగుటూరు, కొండపి, వెల్లంపల్లి వేలం కేంద్రాల్లో 27 నుంచి కొనుగోళ్లు ప్రారంభించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. కర్ణాటకలో నాణ్యమైన పొగాకు కిలో రూ.165 వరకు ధర పలికింది. ప్లాట్‌ఫాం సరాసరి కిలో రూ.145గా ఉంది. వర్షాభావ పరిస్థితుల నేపథ్యంలో దిగుబడులు తగ్గిన పరిస్థితుల్లో మార్కెట్‌పైనే రైతులు ఆశలు పెట్టుకొని అమ్మకాలకు సన్నద్ధమవుతున్నారు

No comments:

Post a Comment