కావలసినవి:
- మైదా: పావుకిలో,
- ఖీమా: అరకిలో,
- ఉల్లిపాయ: ఒకటి,
- పచ్చిమిర్చి: నాలుగు,
- అల్లంవెల్లుల్లి: టేబుల్‌స్పూను
- గరంమసాలా: ఒకటిన్నర టీస్పూన్లు,
- కొత్తిమీర తురుము: 2 టేబుల్‌స్పూన్లు,
- పుదీనా తురుము: 2 టేబుల్‌స్పూన్లు,
- పెరుగు: టేబుల్‌స్పూను,
- ఉప్పు: తగినంత,
- నూనె: వేయించడానికి సరిపడా
తయారుచేసే విధానం:
మైదాలో నాలుగు టేబుల్‌స్పూన్ల నూనె, ఉప్పు వేసి కలిపి చిన్న ఉండలుగా చేయాలి. ఒక్కో ఉండనీ చపాతీలా చేసి రెండుగా కోసి మూతపెట్టి ఉంచాలి. రెండు టేబుల్‌స్పూన్ల మైదాలో కొద్దిగా నీళ్లు పోసి కలిపి పేస్టులా చేసి పక్కన ఉంచాలి. బాణలిలో కొద్దిగా నూనె వేసి ఉల్లి, పచ్చిమిర్చి ముక్కలు, అల్లంవెల్లుల్లి వేసి వేయించాలి. తరవాత కీమా, ఉప్పు వేసి సిమ్‌లో ఉడికించాలి. ఇప్పుడు గరంమసాలా, పెరుగు, కొత్తిమీర, పుదీనా తురుము వేసి కలిపి దించాలి. ఇప్పుడు చపాతీని కోన్‌లా చుట్టాలి. అందులో కూర మిశ్రమాన్ని పెట్టి జాగ్రత్తగా మడిచి అంచులు విడిపోకుండా మైదా పేస్టుతో అతికించాలి. ఇలాగే అన్నీ చేసుకుని కాగిన నూనెలో వేయించాలి.అంతే మీ ఖీమా సమోసా రడీ.
No comments:
Post a Comment