Monday, March 18, 2019

తరువాతి సీఎం ఎవరు?…

పనాజీ  ,న్యూస్‌టుడే:  ముఖ్యాంశాలు….
*2 గంటల కల్లా తుది నిర్ణయం
*వినయ్‌ తెందూల్కర్‌ను ముఖ్యమంత్రి చేయాలని డిమాండ్‌.
 గోవా తదుపరి ముఖ్యమంత్రి ఎవరు అన్న దానిపై ఈరోజు మధ్యాహ్నం 2గంటల కల్లా నిర్ణయం తీసుకుంటామని రాష్ట్ర భాజపా అధ్యక్షుడు తెలిపారు. అనంతరం మధ్యాహ్నం 3గంటల ప్రమాణ స్వీకారం ఉంటుందన్నారు. గోవా ముఖ్యమంత్రి మనోహర్‌ పారికర్‌ కన్నుమూయడంతో తదుపరి సీఎం ఎవరు అన్నదానిపై గత కొన్ని గంటలుగా ఉత్కంఠ నెలకొంది. దీనిపై గత రాత్రి నుంచి భాజపా అధినాయకత్వం అక్కడి భాజపా ఎమ్మెల్యేలు, భాగస్వామ్య పక్షాలతో చర్చలు జరుపుతోంది. అయితే మిత్రపక్షాలు తమకే సీఎం పదవి కట్టబెట్టాలని డిమాండ్‌ చేస్తుండడంతో.. సంప్రదింపులు కొనసాగుతున్నాయి. స్పీకర్‌ ప్రమోద్‌ సావంత్‌ని తదుపరి సీఎంగా భాజపా అనుకున్నప్పటికీ సంకీర్ణ పక్షాలు మహారాష్ట్ర గోమంటక్‌ పార్టీ, గోవా ఫార్వర్డ్‌ పార్టీ నేతలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నట్లు సమాచారం. అలాగే విశ్వజిత్‌ రానే పేరు కూడా తెరపైకి వచ్చింది. మిత్రపక్షాలు వినయ్‌ తెందూల్కర్‌ను ముఖ్యమంత్రి చేయాలని డిమాండ్‌ చేస్తున్నట్లు సమాచారం. దీనిపై భాజపా ఇంకా నిర్ణయం తీసుకోవాల్సి ఉంది.

No comments:

Post a Comment