చిత్తూరు న్యూస్‌టుడే:ముఖ్యాంశాలు….
*సంక్షేమశాఖ పరిధిలోని గురుకులల్లో దుస్తుల పంపిణీ
*దుస్తులతో పాటు ఇతర వస్తువుల పంపిణీ.
సాంఘిక సంక్షేమశాఖ పరిధిలోని బాలయోగి గురుకుల పాఠశాలలో విద్యార్థులకు వంట చేసి పెట్టే సిబ్బందికి దుస్తులను ఉచితంగా పంపీణీ చేసినట్లు రూపేష్ ఎడ్యుకేషనల్ సొసైటీ మేనేజింగ్ డైరెక్టర్ బాబు తెలిపారు.ఆదివారం ఆయన తన కార్యాలయంలో మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా 1354 మంది సిబ్బందిని నియమించేందుకు ప్రభుత్వం అనుమతిని ఇచ్చిందని వారందరికి ఉచితంగా ఏకరూప దుస్తులతో పాటు,తలకు టోపీ,చేతికి గ్లౌజులు ఇచ్చినట్లు పేర్కొన్నారు.పిల్లలకు పెట్టే భోజనం నాణ్యతగా ఉండడంతో పాటు పరిశుభ్రంగా ఉండాలని సదుద్దేశంతో అందుకు అవసరమైన దుస్తులు ఇచ్చినట్లు చెప్పారు.

No comments:
Post a Comment