భూవనగిరి న్యూస్‌టుడే:ముఖ్యంశాలు……
*కెమికల్ కంపెనీలో అగ్నిప్రమాదం..
*కంపెనీలో విద్యుత్తు షార్ట్ సర్క్యూట్ కారణంగా ప్రమాదం జరిగింది…
యాదాద్రి భువనగిరి జిల్లా భువనగిరి పట్టణంలోని పారిశ్రామికవాడలో ఉన్న శ్రీమహాసాయి కెమికల్ కంపెనీలో ఆదివారం అర్ధరాత్రి
దాటాక భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. పలు రసాయనాలు తయారు చేసే ఈ కంపెనీలో విద్యుత్తు షార్ట్ సర్క్యూట్ కారణంగా ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. సమాచారం తెలుసుకున్న సబ్‌కలెక్టర్ కార్యాలయం పాలనాధికారి ఎం.ఉపేందర్‌రెడ్డి సంఘటనా స్థలానికి చేరుకొని ఇతర పరిశ్రమల యజమానులను అప్రమత్తం చేశారు. జిల్లాలోని యాదగిరిగుట్ట, చౌటుప్పల్ అగ్నిమాపక కేంద్రాలకు సమాచారం అందించి పిలిపించారు. ఎగసిపడుతున్న మంటలను అగ్నిమాపక సిబ్బంది ఆర్పారు. దాదాపు రూ.10 కోట్ల మేర ఆస్తి నష్టం సంభవించి ఉంటుందని అంచనా వేస్తున్నారు.

No comments:
Post a Comment