Saturday, March 16, 2019

బహిరంగ సభను జయప్రదం చేయాలని….

కర్నూలు న్యూస్‌టుడే:
పవర్‌గ్రిడ్‌ పక్కన ఈ నెల 18న వైకాపా ఆధ్వర్యంలో నిర్వహించే బహిరంగ సభను జయప్రదం చేయాలని వైకాపా పాణ్యం నేత కాటసాని రాంభూపాల్‌రెడ్డి కోరారు. ఓర్వకల్లులోని పవర్‌గ్రిడ్‌ పక్కన ఈ నెల 18న వైకాపా ఆధ్వర్యంలో నిర్వహించే బహిరంగ సభను జయప్రదం చేయాలని వైకాపా పాణ్యం నేత కాటసాని రాంభూపాల్‌రెడ్డి కోరారు. శుక్రవారం ఆయన తన అనుచరులతో ఓర్వకల్లును సందర్శించి స్థలాన్ని పరిశీలించారు. బహిరంగ సభకు వైకాపా అధినేత జగన్‌మోహన్‌రెడ్డి హాజరవుతున్నట్లు తెలిపారు. వైకాపా నాయకులు, కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో నాయకులు ప్రభాకరరెడ్డి, మహేశ్వరరెడ్డి, రంగనాథగౌడ్‌ తదితరులు పాల్గొన్నారు.

No comments:

Post a Comment