గుంటూర్ న్యూస్‌టుడే:ముఖ్యాంశాలు….
- వాహనం నుంచి పొగలు వస్తుండడాన్ని గమనించిన ఆపి, పక్కకు వచ్చారు….
- ఈ క్రమంలో పెద్దఎత్తున మంటలు వచ్చాయి. …..
- షార్ట్‌సర్క్యూట్ జరిగి మంటలు రేగినట్లు భావిస్తున్నారు…….
ద్విచక్రవాహనం దగ్ధమైన ఘటన శుక్రవారం సాయంత్రం కనకదుర్గమ్మవారధి సమీపంలోని జాతీయ రహదారిపై చోటుచేసుకుంది. గుంటూరు జిల్లా దుగ్గిరాల మండలం పెనుమూలికి చెందిన కొరిటాల శేషగిరిరావు వ్యవసాయం చేస్తుంటారు. శుక్రవారం మధ్యాహ్నం మంగళగిరిలో తెదేపా కార్యక్రమానికి హాజరై అనంతరం ద్విచక్రవాహనంపై విజయవాడకు బయలుదేరారు. వారధిని దాటి కూడలి వద్దకు చేరుకుంటున్న క్రమంలో వాహనం నుంచి పొగలు వస్తుండడాన్ని గమనించిన శేషగిరిరావు వెంటనే ఆపి, పక్కకు వచ్చారు. ఈ క్రమంలో పెద్దఎత్తున మంటలు వచ్చాయి. సమీపంలోని ట్రాఫిక్ పోలీసులు అగ్నిమాపక సిబ్బందికి సమాచారం ఇవ్వడంతో వారు అక్కడకు చేరుకుని, మంటలు ఆర్పివేశారు. ఘటనలో వాహనం పూర్తిగా దగ్ధమైంది. షార్ట్‌సర్క్యూట్ జరిగి మంటలు రేగినట్లు భావిస్తున్నారు
No comments:
Post a Comment