ఆదోని నేరవార్తలు, న్యూస్‌టుడే:
- రుణాలు తీసుకోకపోయినా రుణాలు తీసుకున్నట్లు వాటికి సంబంధించిన అప్పులు చెల్లించమంటూ ఈ నెల 5న తమకు నోటీసులు వచ్చాయని బాధితులు వాపోయారు..
- పంట రుణాలు తీసుకోకపోయినా అప్పులు చెల్లించాలంటూ ‘కేడీసీసీ’ బ్యాంకు అధికారులు రైతులకు నోటీసులు పంపించడంతో విస్తుపోయిన రైతన్నలు బుధవారం పోలీసుస్టేషన్‌కు ఆశ్రయించారు.
బాధితులు తెలిపిన వివరాల మేరకు ఇలా ఉన్నాయి. మండల కేంద్రమైన కౌతాళానికి చెందిన వీరేష్ పేరిట రూ.4.32 లక్షలు, గోపాల్‌రెడ్డి పేరిట రూ.2.59 లక్షలు, ఉసేని పేరిట రూ.4 లక్షలు, ఖాదరయ్య పేరిట రూ.4.32 లక్షలు, దేవమ్మ పేరిట రూ.4.32 లక్షలు, వెంకన్న పేరిట రూ.4.32 లక్షలు ఇలా మరికొందరు రైతులు ఆదోని కేడీసీసీ బ్యాంకులో రుణాలు తీసుకోకపోయినా రుణాలు తీసుకున్నట్లు.. వాటికి సంబంధించిన అప్పులు చెల్లించమంటూ ఈ నెల 5న తమకు నోటీసులు వచ్చాయని బాధితులు వాపోయారు. తమకు న్యాయం చేయాలంటూ ఆదోని డీఎస్పీ వెంకటరాముడును కలసినట్లు చెప్పారు. అక్కడి నుంచి రెండో పట్టణ పోలీసుస్టేషన్‌లో ఎస్సై మధుసూదన్‌రెడ్డికి ఫిర్యాదు చేశామన్నారు ఈ విషయమై కేడీసీసీ ఆదోని బ్యాంకు మేనేజరు షేక్ మహబూబ్‌బాషాను న్యూస్‌టుడే వివరణ కోరగా ఘటనపై జిల్లా కేడీసీసీ బ్యాంకు అధికారులు విచారణ చేస్తున్నారని సమాధానం ఇచ్చారు.
No comments:
Post a Comment