ప్రకాశం న్యూస్‌టుడే:
- తెదేపా కార్యకర్త అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన సంఘటన స్థానిక 21వ డివిజన్‌లోని అంబేడ్కర్ భవన్ సమీపంలో సోమవారం రాత్రి చోటుచేసుకుంది.
- ఒకటో పట్టణ పోలీసుల కథనం మేరకు… స్థానిక అంబేద్కర్ భవన్ సమీపంలో చిమటా వెంకట రామరాజు(40) నివాసం ఉంటున్నారు. ప్రస్తుతం 21వ డివిజన్ తెదేపా అధ్యక్షుడిగా వ్యవహరిస్తున్నారు
- మంగళవారం ఉదయం ఆయన ఉరివేసుకున్నట్లు గుర్తించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు.
- సంఘటనా స్థలాన్ని పరిశీలించిన పోలీసులు స్టూలు పైకి ఎక్కి ఫ్యాను కొక్కేనికి కండువాలతో ఉరి వేసుకున్నట్లు తెలిపారు.
- స్టూలుపై కాస్త కూర్చున్నట్లుగా కాళ్లు నేలకు ఆని ఉండడంతో పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.వేరొక మహిళలతో సన్నితంగా ఉండడమే మరణానికి కారణంగా అనుమానిస్తున్నారు. సమాచారం తెలియగానే ఒంగోలు చేరుకున్న కుటుంబసభ్యులు మృతదేహాన్ని చూసి కన్నీరుమున్నీరయ్యారు. మృతుని భార్య ఫిర్యాదు మేరకు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నట్లు ఏఎస్సై డేవిడ్ తెలిపారు.

No comments:
Post a Comment