ప్రకాశం న్యూస్‌టుడే:
1.టీన్యూస్10 ఆన్‌లైన్ ఎడిషన్
2.ఇబ్బందులు పడుతున్న వేతనదారులు …..
3.వేసవి భత్యం కింద అదనపు వేతనం ...
జాతీయ గ్రామీణ ఉపాధిహామీ పథకం కూలీలకు ఊరట లభించింది. గతేడాది డిసెంబరు మొదటి వారం నుంచి జిల్లాలో కూలీలకు వేతనాల చెల్లింపు నిలిచిపోయింది. ఓ పక్క వ్యవసాయ పనులు ముగిసినా మూడు నెలలుగా వేతనాలు అందకపోవడంతో పనులకు రావడానికి కూలీలు వెనకడుగు వేస్తున్నారు. తాజాగా రాష్ట్ర గ్రామీణాభివృద్ధి శాఖ రూ.106.63 కోట్లు విడుదల చేసింది. అందులో జిల్లాకు రూ.20 కోట్లు కేటాయించారు. రానున్న రెండు, మూడు రోజుల్లో కూలీల బ్యాంకు ఖాతాల్లో నేరుగా వేతనాలు జమకానున్నట్లు డ్వామా పీడీ వెంకటేశ్వర్లు తెలిపారు. వేసవి భత్యం కింద అదనపు వేతనం ఇస్తున్నందున కూలీలు ఉపాధి పనులకు హాజరుకావాలని కోరారు.

No comments:
Post a Comment