గుంటూరుజిల్లా: న్యూస్‌టుడే:
* ఓటు హక్కును వినియోగించుకునేలా అనుమతి…
కృష్ణా-గుంటూరు పట్టభద్రుల నియోజకవర్గ ఎమ్మెల్సీ ఎన్నికలు ఈ నెల 22న జరుగుతున్నందున ఓటరుగా నమోదైన పట్టభద్రులు ఓటు హక్కు వినియోగించుకోవటానికి ప్రత్యేక అనుమతి ఇస్తున్నట్లు జిల్లా కలెక్టర్, ఎన్నికల అధికారి కోన శశిధర్ తెలిపారు. కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు గుంటూరు, కృష్ణా జిలాల్లో ప్రైవేటు సంస్థలు, వ్యాపార, వాణిజ్య పరిశ్రమల్లో పని చేస్తున్న ఉద్యోగులు…పట్టభద్రుల ఓటరు జాబితాలో పేరు ఉంటే వారు ఓటు హక్కును వినియోగించుకునేలా అనుమతి ఇవ్వాలని ఆయా సంస్థలను ఆదేశించారు. 22న ఉదయం 8 నుంచి సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్ కేంద్రాల్లో ఓటును వినియోగించుకోవచ్చన్నారు. ఉద్యోగులు, కార్మికులు ఓటు వేసేందుకు ఆయా సంస్థల యాజమాన్యాలు అనుమతి ఇవ్వాలని ఆదేశించారు. ఆలస్యంగా విధులకు హాజరయ్యేందుకు, షిఫ్ట్‌ల సర్ధుబాటు చేయాలని సూచించారు.

No comments:
Post a Comment