గుంటూరుజిల్లా: న్యూస్‌టుడే:
*31 ఉద్యోగ ప్రకటనలను…
*పోటీ అసాధారణ స్థాయిలో ఉన్నట్లు స్పష్టం…
ప్రభుత్వ కొలువులపై నిరుద్యోగుల ఆశలు ఏ రేంజ్‌లో ఉన్నాయో తాజాగా ఏపీపీఎస్సీ విడుదల చేసిన నోటిఫికేషన్ల కు అందిన దరఖాస్తులను బట్టి అర్ధమవుతోంది. కమిషన్ ఇటీవల విడుదల చేసిన 31 ఉద్యోగ ప్రకటనలను విశ్లేషిస్తే ఒక్కో కొలువుకు పోటీ అసాధారణ స్థాయిలో ఉన్నట్లు స్పష్టమైంది.20 డివిజనల్ అకౌంట్స్ ఆఫీసర్స్ (డీఏవో) పోస్టులకు రికార్డు స్థాయిలో 37,876 మంది అభ్యర్ధులు దరఖాస్తు చేసుకున్నారు. ఒక్కో పోస్టుకు 1,894 మంది పోటీ పడుతున్నారు. ఆ తర్వాత గ్రూప్-1 పోస్టుకు 677 మంది, ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ (ఎఫ్ఆర్‌వో) పోస్టుకు 672 మంది, గ్రూప్-2 పోస్టుకు ఒక్కొక్క దానికి 662 మంది దరఖాస్తు చేశారు.

No comments:
Post a Comment