పుల్వామా న్యూస్‌టుడే :
*పుల్వామాలో ఉగ్రవాదులు మరోసారి దాడి చేశారు.*ఓ పౌరుడు మరణించాడు.
జమ్మూకాశ్మీర్ రాష్ట్రంలోని పుల్వామాలో ఉగ్రవాదులు మరోసారి దాడి చేశారు.పుల్వామాలోని పింగ్‌లేనా ప్రధాన రోడ్డుపై ఉగ్రవాదులు జరిపిన దాడిలో ఓ పౌరుడు మరణించాడు. మృతుడు పింగ్ లేనా పుల్వామా నివాసి అయిన ముహమ్మద్ యూసుఫ్ నైకో కుమారుడు షౌకత్ అహ్మద్ నైకూ అని పోలీసులు చెప్పారు. భద్రతా బలగాలతోపాటు జమ్మూ కాశ్మీర్ పోలీసులు సంఘటన స్థలానికి వచ్చి ఉగ్ర దాడిపై దర్యాప్తు చేస్తున్నారు. మృతుడికి పోస్టుమార్టం చేయించి మృతదేహాన్ని అతని కుటుంబసభ్యులకు అప్పగించారు.

No comments:
Post a Comment