భద్రాద్రి కొత్తగూడెం న్యూస్‌టుడే:
* ఇష్టంలేని పెళ్లి చేస్తున్నారని ఓ యువతి ఆత్మహత్య.
ఇష్టంలేని పెళ్లి చేస్తున్నారని ఓ యువతి ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డ సంఘటన భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో చోటుచేసుకుంది. ఇల్లెందు పట్టణంలోని ఇందిరానగర్‌కు చెందిన సునీత(22) అనే యువతికి కుటుంబ సభ్యులు ఇటీవల ఓ వ్యక్తితో వివాహం చేసేందుకు నిర్ణయించారు. అయితే… ఈ పెళ్లి సునీతకు ఇష్టం లేదు. కాగా… ఓపక్క ఇష్టంలేని పెళ్లి చేసుకోలేక, మరోపక్క కుటుంబ సభ్యులకు ఈ విషయం చెప్పలేక గురువారం తెల్లవారుజామున ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది. పోలీసులు కేసునమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు.

No comments:
Post a Comment