Saturday, March 2, 2019

సృజనాత్మకత విరిసేలా బోధించాలి…….

శ్రీకాకుళం,న్యూస్‌టుడే:
విద్యార్థులకు నైతిక విలువలతో కూడిన విద్య అందించడంతో పాటు సాంకేతికత పరిజ్ఞానాన్ని అందించాలని జిల్లా విద్యాశాఖాధికారి ఎం.సాయిరాం పిలుపునిచ్చారు. శ్రీకాకుళం నగరంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో ఆప్‌కాస్ట్‌- ఫిజిక్స్‌ ఫోరం ఆధ్వర్యంలో సృజనోత్సవ కార్యక్రమం నిర్వహించారు.ఈ  సందర్భంగా  డీఈవో మాట్లాడుతూ మారుతున్న కాలంతో పాటు బోధనలో కూడా మార్పులు చేయాలన్నారు.విద్యార్థుల్లోని ఆలోచనా శక్తి పెంపొందించి,తిత్లీ తుపానులో ప్రయోగశాలలు పాడైన 15 పాఠశాలలకు రూ. 9 వేల విలువ గల పరికరాలను ఒక్కో పాఠశాలకు ఫిజిక్స్‌ ఫోరం తరఫున అందజేశారు. ప్రసూనాంబ స్మారక ట్రస్టు వారు ప్రభుత్వ ఉన్నత పాఠశాల  ప్రయోగశాల వినియోగించాలని  కోరుతూ రూ.10  వేల చెక్కును వ్యవస్థాపకులు వీజీకే మూర్తి అందజేశారు. కార్యక్రమంలో పాలకొండ ఉపవిద్యాశాఖాధికారి బ్రహ్మాజీరావు, ఫిజిక్స్‌ ఫోరం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జి.సురేందర్‌రెడ్డి, ఆప్‌కాస్టు కో-ఆర్డినేటర్‌, ఎన్‌.కుమారస్వామి, ప్రతినిధులు ఎస్‌.ఉమామహేశ్వరి, సాయిశ్రీనివాసశర్మ, లక్ష్మణ్‌, రవికుమార్‌, పూర్ణిమ, కిరణ్‌, కామేశ్వరరావు, తదితరులు పాల్గొన్నారు.   
                                                             

No comments:

Post a Comment