శ్రీనగర్ న్యూస్‌టుడే:
- త్రాల్ ఎన్‌కౌంటర్‌లో మట్టుబెట్టిన సైన్యం
- దాడికి వాహనం సమకూర్చిన ముదాసిర్
- గ్రాడ్యుయేషన్‌తో పాటు ఎలక్ట్రీిషియన్‌గా డిప్లొమా
- 2017లో జైషే ఉగ్రవాద సంస్థలో చేరిక
- 70 రోజుల్లో 44మంది ఉగ్రమూకలు హతం
- పుల్వామా ఘటన తర్వాత 18మంది
- మృతుల్లో 14మంది జైషే మహ్మద్ మిలిటెంట్లు
- వివరాలు వెల్లడించిన ఆర్మీ అధికారులు
జైషే మహ్మద్ ఆత్మాహుతి దాడికి పాల్పడిన విషయం తెలిసిందే. త్రాల్‌లోని పింగ్లిష్ ప్రాంతంలో ఆదివారం జరిగిన ఎదురుకాల్పుల్లో జైషే మహ్మద్ ఉగ్రవాది ముదాసిర్ అహ్మద్ ఖాన్ అలియాస్ మహ్మద్ భాయ్‌ను మట్టుబెట్టినట్టు ఆర్మీ అధికారులు వెల్లడించారు. ఈ ఎన్‌కౌంటర్‌లో ముగ్గురు మిలిటెంట్లు హతమయ్యారని, అందులో ముదాసిర్ ఒకడని వివరించారు. ముదాసిర్, పుల్వామా దాడి సూత్రధారి అని జనరల్ ఆఫీసర్ కమాండింగ్ లెఫ్టినెంట్ జనరల్ కన్వాల్ జీత్ సింగ్ దిల్లాన్ చెప్పారు. పింగ్లిష్ ప్రాంతంలో ఉగ్రవాదులు సంచరిస్తున్నారనే నిఘా వర్గాల సమాచారంతో భద్రతా సిబ్బంది ఆదివారం కార్డెన్ సెర్చ్ చేపట్టిందని జమ్మూ కాశ్మీర్ సీఆర్‌పీఎఫ్ ఇన్‌స్పెక్టర్ జనరల్ (ఆపరేషన్స్) జుల్ఫికర్ హసన్ తెలిపారు. పారామిలటరీ ఫోర్స్, రాష్ట్ర పోలీసు విభాగం సంయుక్తంగా నిర్వహించిన ప్రెస్ కాన్ఫరెన్స్‌లో పలు వివరాలు వెల్లడించారు. తనిఖీలు చేపడుతున్న సమయంలో ఓ ఇంట్లో నక్కి ఉన్న మిలిటెంట్లు భద్రతా దళాల రాకను పసిగట్టి వారిపై కాల్పులు జరిపారని వివరించారు. దీంతో జవాన్లు ఎదురుకాల్పులు జరపగా ఇద్దరు జైషే మహ్మద్ ఉగ్రవాదులు హతమైనట్టు తెలిపారు.

No comments:
Post a Comment