Monday, March 11, 2019

సాంకేతిక లోపంలో నిలిచిపోయిన రాజారాణి ఎక్స్‌ప్రెస్‌…..

శ్రీకాకుళం,న్యూస్‌టుడే:
గుణుపూర్‌ నుంచి రూర్కెలా వెళ్లాల్సిన రాజారాణి ఎక్స్‌ప్రెస్‌కు పెనుప్రమాదం తప్పింది.పలాస వైపు నుంచి ఒడిశాకు వెళ్లేందుకు ఇచ్ఛాపురం రెండో నంబరు ఫ్లాట్‌ఫారంపై సాయంత్రం 7గంటలకు రైలు ఆగింది.తిరిగి బయలుదేరే సమయంలో ఇంజిన్‌లోని డీజిల్‌ ట్యాంకు నుంచి చమురు ధారగా కారుతుండటాన్ని గమనించిన రైలు డ్రైవర్‌ రైలును నిలిపివేసి,చమురుకారకుండా ప్రయత్నం చేశారు. ఈలోగా సమాచారాన్ని రైలునిలయం సూపరింటెండెంట్‌ షాబిత్‌కు చేరవేయడంతో ఆయన నిపుణులను పంపించారు.వారు కూడా ఎంత ప్రయత్నించినా,ఆపలేకపోవడంతో ఆ ఇంజిన్‌ను తప్పించి, కొత్త ఇంజిన్‌ను రప్పించారు. అనంతరం రాత్రి 9:30 గంటలకు ఇచ్ఛాపురం నుంచి రైలు బయలుదేరింది. దీంతో ప్రయాణికులు ప్లాట్‌ఫారంపై పడిగాపులు కాశారు.సోంపేట ఆర్‌ఎస్‌లో నిలిపివేసి,అనంతరం ఇచ్ఛాపురం రైలు నిలయం ప్రధానమార్గం మీదుగానే నడిపారు.మధ్యపట్టాల పైనే ఇంటర్‌ సిటీ ఆగడంతో ప్రయాణికులు రైలు ఎక్కేందుకు ఇబ్బందిపడ్డారు.రాజారాణి ఎక్స్‌ప్రెస్‌ ప్రయాణికులు  కొందరు ఇంటర్‌సిటీని ఆశ్రయించి గమ్యానికి చేరుకొన్నరు.

No comments:

Post a Comment