మంగమూరు ప్రకాశం న్యూస్‌టుడే:
వివాహిత ఆత్మహత్య చేసుకున్న సంఘటన మంగళవారం మంగమూరులో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు… గ్రామానికి చెందిన శ్రీదేవి, అదే గ్రామానికి చెందిన పేరయ్యను రెండేళ్ల క్రితం కులాంతర వివాహం చేసుకొంది. వీరికి ఒక పాప, ప్రస్తుతం ఆమె మూడు నెలల గర్భవతి. వారం రోజుల క్రితం అమ్మగారి ఇంటికి వచ్చిన ఆమెను కులాంతర వివాహం చేసుకొందని చుట్టు పక్కల వారు సూటిపోటి మాటలు అనడంతో మనస్థాపానికి గురయింది. దీంతో మంగళవారం ఉదయం ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకుంది. సంఘటన స్థలాన్ని శిక్షణ ఐపీఎస్ బిందుమాధవ్, సీఐ దుర్గాప్రసాద్, ఎస్సై ఖాదర్‌బాషా, తహసీల్దారు పద్మనాభుడు పరిశీలించారు. మృతురాలి తల్లి కుంచాల కళ్యాణి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు.

No comments:
Post a Comment