Wednesday, March 20, 2019

మన్యుసూక్త వారాభిషేకం నిర్వహిస్తున్న రుత్విక్కులు……


శింగరకొండ ప్రకాశం  న్యూస్‌టుడే: 
శింగరకొండ ప్రసన్నాంజనేయ స్వామి, లక్ష్మీనరసింహ స్వామి వార్ల వార్షిక తిరునాళ్ల రెండో రోజైన మంగళవారం సందడిగా సాగాయి. క్షేత్రపాలకుడు లక్ష్మీనరసింహస్వామి.. పిలిచిన పలికే దైవంగా పూజలందుకునే ప్రసన్నాంజనేయ స్వామి వార్ల ఆలయాల్లో భక్తులు వారాభిషేకాలు నిర్వహించారు. దేవాదాయ శాఖ సహాయ కమిషనర్‌ కేబీ.శ్రీనివాసరావు, పట్టణంలోని భక్తులు ఈ కార్యక్రమాలను ఆద్యంతం వీక్షించారు. ఆలయ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన టీవీల్లోనూ ప్రసారం చేసిన అభిషేకం దృశ్యాలను భక్తులు ఆసక్తిగా వీక్షించారు. 16 ద్రవ్యాలతో అభిషేక కార్యక్రమాన్ని పూర్తిచేశారు. జిల్లా కలెక్టర్‌ వినయ్‌చంద్‌ మాతృమూర్తి లక్ష్మీనాగ గిరిజ స్వామి వారి దర్శనం చేసుకున్నారు. ఆలయ సహాయ కమిషనర్‌ కేబీ.శ్రీనివాసరావు నేతృత్వంలో అద్దంకి, ఒంగోలుకు చెందిన 18మంది రుత్విక్కులు ఈ అభిషేక క్రతువులో భాగస్వాములయ్యారు.

No comments:

Post a Comment